లింగంగుంట్లలో పశువైద్య శిబిరం నిర్వహణ
ప్రకాశం: హనుమంతునిపాడు మండలం లింగంగుంట్లలో సోమవారం పశు వైద్యాధికారులు పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి నట్టల నివారణ, వ్యాధినిరోధక టీకాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల టీడీపీ అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి సూచించారు.