సీనియర్ సివిల్ జడ్జిని సత్కరించిన న్యాయవాదులు

NZB: జిల్లా సీనియర్ సివిల్ జడ్జిగా సేవలందించి హైదరాబాద్‌కు బదిలీపై వెళ్తున్న శ్రీకాంత్ బాబును సోమవారం న్యాయవాదులు వీడ్కోలు సమావేశం నిర్వహించి సత్కరించారు. జడ్జిగా ఎన్నో సివిల్ కేసులను పరిష్కరించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయి రెడ్డి, కార్యదర్శి మానిక్ రాజు, ఉపాధ్యక్షుడు దిలీప్, న్యాయవాదులు పాల్గొన్నారు.