VIDEO: గ్రామానికి భూమి దానం చేసిన వృద్ధుడు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని పెంచికల్పేట గ్రామంలో వృద్ధాప్యంలో ఉన్న నాగిళ్ల వెంకటేశ్వరు తన భూమి 4.38 ఎకరాలను గ్రామపంచాయతీకి శుక్రవారం దానం చేశారు. తనకు ఉన్న కుమారులు శ్రద్ధ చూపకపోవడంతో, తన బాగోగులను గ్రామస్థులు చూసుకుంటున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామపెద్దల సమక్షంలో రాసిచ్చారు.