ఘనంగా పెంపుడు శునకానికి అంత్యక్రియలు

ఘనంగా పెంపుడు శునకానికి అంత్యక్రియలు

SRPT: మనిషి చనిపోతే అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో, చనిపోయిన పెంపుడు శునకానికి కూడా అదేవిధంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన, సామేలు జయమ్మ దంపతులు 14 ఏళ్లగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. ఆ శునకం శనివారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందగా మనిషికి నిర్వహించే తరహాలో శునకానికి అంతక్రియలు నిర్వహించారు.