నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి: ఎమ్మెల్యే
BHPL: మొంథా తుఫాను ప్రభావంతో BHPL జిల్లాలో గత 24 గంటల్లో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని MLA గండ్ర సత్యనారాయణ రావును, గోరికొత్తపల్లి బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కానుగంటి శ్రీనివాస్ ఇవాళ డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు,అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లాలని సూచించారు.