SLw vs INDw: భారత్‌కు తొలి ఓటమి

శ్రీలంకతో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి ఓటమి చవిచూసింది. టీమిండియాపై శ్రీలంక 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 275/9 పరుగులు చేసింది. 276 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక బ్యాటర్లలో నీలాక్షి (56), హర్షిత సమరవిక్రమ (53) అర్ధ శతకాలు బాదారు.