టపాకాయల దుకాణాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ
MBNR: దీపావళి సందర్భంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఎస్పీ జానకి సూచించారు. అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే Act 1884 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆమె తెలిపారు.