రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్

రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్

RR: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు రాంగ్ సైడ్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌ను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న వారిని తనిఖీ చేశారు. అనంతరం వారికి జరిమానాలను విధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.