రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి

అన్నమయ్య: జిల్లాలోని సంబేపల్లిలోని ఎర్రగుంట్ల వద్ద సోమవారం నాడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు బీసీ జనార్దన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.