రేపు సోమందేపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేత
సత్యసాయి: సోమందేపల్లి మండలం 33/11 కేవీ చల్లపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని చల్లపల్లి, మాగేచెరువు, చెన్నాపురం, మండ్లి ఓబుళదేవరపల్లి గ్రామాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ పరమేశ్వరరెడ్డి తెలిపారు. అత్యవసర మరమ్మతుల పనుల కారణంగా గురువారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు.