రామప్పను సందర్శించిన అమెరిక దేశస్థుడు

రామప్పను సందర్శించిన అమెరిక దేశస్థుడు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని శుక్రవారం అమెరికాకు చెందిన డేవిడ్ రెనాల్ట్ సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామికి పూజలు చేశారు. అనంతరం ఆలయ శిల్ప సంపదను  అర్చకులను అడిగి తెలుసుకున్నారు. రామప్ప శిల్ప సంపద అద్భుతంగా ఉందని రోనాల్డ్ కితాబిచ్చారు. ఆయన వెంట టూరిస్ట్ పోలీసులు తదితరులు ఉన్నారు.