VIDEO: ఉగ్రరూపం దాల్చిన కొత్తపల్లి వాగు

నారాయణపేట: ఉగ్రరూపం దాల్చిన కొత్తపల్లి. కొత్తపల్లి మండల కేంద్రం నుంచి భూనీడు వెళ్లే ప్రధాన రహదారిపై గల వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో కోస్గి, నారాయణపేట, మహబూబ్ నగర్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగు ఉధృతి నేపథ్యంలో ప్రజలు, రైతులు, వాహనదారులు వాగు దాటే సాహసం చేయకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.