VIRAL: ప్రాణం తీసిన EV కారు

తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ చోట ఇంటి బయట టాటా హారియర్ EV కారును పార్క్ చేయగా, ర్యాంపు నుంచి వేగంగా వెనక్కి వెళ్లిపోయింది. దీంతో వెనుక ఉన్న ఓ వ్యక్తి టైర్ కింద పడి చనిపోయాడు. 'సమ్మన్ మోడ్' ఫీచర్ లోపమే ఇందుకు కారణమని విమర్శలొస్తున్నాయి. టాటా మోటార్స్ సంస్థ దీనిపై స్పందిస్తూ.. ఆ సమయంలో కారు ఆన్‌లో లేదని, గ్రావిటీ వల్లే వెనక్కి వెళ్లిందని స్పష్టం చేసింది.