ఆర్జీ -2 ఏరియాలో 219 శాతం బొగ్గు ఉత్పత్తి

ఆర్జీ -2 ఏరియాలో 219 శాతం బొగ్గు ఉత్పత్తి

PDPL: ఆర్జీ -2 ఏరియా ఏప్రిల్ మాసంలో అధిక ఉత్పత్తిని సాధించిందని జీఎం వెంకటయ్య పేర్కొన్నారు. బుధవారం జీఎం కార్యాలయంలో ఏప్రిల్ మాసానికి సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, ఓవర్ బర్డ‌న్ వెలికితీత, రవాణా వివరాలను వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మాసానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పతి లక్ష్యాలలో 2, 28, 400 టన్నులకు 4, 99, 990 టన్నులు తీశామన్నారు.