'మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీతో వైసీపీ నేతలు భేటీ'

AKP: అనకాపల్లి పార్లమెంటరీ వైసీపీ ఇంఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో సోమవారం ఎలమంచిలి వైసీపీ నేతలు సమావేశం అయ్యారు. పార్టీ స్థితిగతులపై చర్చించారు. ధర్మశ్రీ నాయకత్వంలో పార్టీకి పూర్వవైభవం వస్తుందని వారు ఆకాంక్షించారు. ఇందులో ఎంపీపీలు ఆడారి బుచ్చిబాబు, కిషోర్, కోన బుజ్జి, జెడ్పీటీసీలు నారం రాంబాబు, రాము, సోము, తదితరులు పాల్గొన్నారు.