ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు
NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ చండూరు, నాంపల్లి మండలాలలో పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించనున్నారు అని వారు వివరాలు వెల్లడించారు.