టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

NLG: మిర్యాలగూడ మండలం కేశవపురంలో టిప్పర్ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. కేశవపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.