మత్స్యకారులకు వాహనాల మంజూరు: అదనపు కలెక్టర్
కామారెడ్డి జిల్లాకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద, జనరల్ కేటగిరీ కింద 8, ఎస్సీ కేటగిరీ కింద 2, ఎస్టీ కేటగిరీ కింద1, మహిళా కేటగిరీ కింద 2, మొత్తం 13 వాహనాలను మంజూరు అయ్యాయని జిల్లా అదనపు కలెక్టర్ మధు మెహన్ చెప్పారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు.