తెనాలిలో డ్రగ్స్ రాకెట్ బట్టబయలు..!
GNTR: తెనాలి సుల్తానాబాద్‌లో డ్రగ్స్ సరఫరా వ్యవహారం బయటపడింది. త్రీ టౌన్ పోలీసులు నిన్న రాత్రి దాడులు నిర్వహించి మార్కెట్ యార్డ్ సమీపంలో నిందితులను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన 5 గ్రాముల ఎండీఎంఏను యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్‌ను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.