మహిళలకు త్వరలోనే ఉచిత బస్సులు

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డికి నియోజకవర్గ మహిళల్లో నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళల అభ్యున్నతి, వారి అభివృద్ధి కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కూడా కూటమి ప్రభుత్వం ప్రారంభించబోతుందని ఆయన తెలిపారు.