పాఠశాలలో డిజిటల్ ప్యానెల్ బోర్డు ధ్వంసం చేసిన దుండగులు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని శీలంవారిపల్లి జడ్పీ హైస్కూల్ ప్లస్‌లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ ప్యానెల్ బోర్డును గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. రూ.5 లక్షలతో ప్రభుత్వం పాఠశాలలో 5 డిజిటల్ ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేసింది. పాఠశాలలోని ఓ గదిలో డిజిటల్ ప్యానెల్ బోర్డు ధ్వంసం చేయడంపై పాఠశాల హెచ్ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు.