చెంగాలమ్మ నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

చెంగాలమ్మ నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

TPT: సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో జరుగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి స్థానికురాలు డి. అన్నపూర్ణ రూ. లక్ష విరాళం సమర్పించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి (ఈవో) ప్రసన్న లక్ష్మీకి ఆమె అందజేశారు. భక్తులందరికీ నిత్యాన్నదానం అందించేందుకు ఈ సహకారం ఎంతో తోడ్పాటుగా ఉంటుందని అధికారులు తెలిపారు.