రైలు కిందపడి వ్యక్తి మృతి
NLR: కావలి-తెట్టు రైల్వే స్టేషన్ల మధ్య గురువారం గుర్తు తెలియని సుమారు 60-65 ఏళ్ల వ్యక్తి రైలు కిందపడి మరణించాడు. తెల్లని జుట్టు, గడ్డం కలిగిన ఆ వ్యక్తి గోధుమ రంగు చొక్కా, బ్లూ కలర్ చెక్స్ షర్టు, నలుపు పెట్టెలతో కూడిన బ్లూ లుంగీ ధరించి ఉన్నాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.