కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు రైతుల ధర్నా
NZB: ఆలూర్ మండలం ఇస్సాపల్లి రైతులు ఇవాళ ఆలూర్ సీఈఓ ఛాంబర్ ఎదుట మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని ధర్నా చేపట్టారు. ఎండలకు మక్కలు ఎండిపోయాయని, ఆకస్మిక వర్షాల కారణంగా తడిసి నష్టపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, తమ పంటకు సరైన ధర కల్పించాలని డిమాండ్ చేశారు.