VIDEO: మరికాసేపట్లో వంతెనపైకి నీరు

VIDEO: మరికాసేపట్లో వంతెనపైకి నీరు

NTR: జగ్గయ్యపేట మండలంలోని మున్నేరు వాగులో వరద ఉధృతి పెరుగుతోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.2 అడుగులకు చేరగా, వరద ప్రవాహం 20వేల క్యూసెక్కులకు చేరింది. లింగాల వద్ద వంతెన అంచులను తాకుతూ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరికొద్ది గంటల్లో వంతెనపైగా నీరు ప్రవహించే అవకాశం ఉండటంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తమై రాకపోకలు నిలిపివేయడానికి సిద్ధమయ్యారు.