నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి

నేడు జిల్లాలో  పర్యటించనున్న మంత్రి

ATP: అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటిస్తున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో జరిగే సాగునీటి సలహా బోర్డు సమావేశంలో పాల్గొంటారన్నారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శిస్తారని తెలిపారు. అక్కడి నుంచి ధర్మవరం వెళ్తారని వెల్లడించారు.