VIDEO: వైభవంగా చందనోత్సవం ప్రారంభం

Vsp: సింహాచలంలో బుధవారం తెల్లవారుజామున శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం ఘనంగా జరిగింది. భారీ వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా భక్తులు గోవిందనామ స్మరణతో స్వామివారికి నీరాజనాలు పలికారు. అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు కుటుంబ సభ్యులు, మంత్రులు తొలి దర్శనం చేసుకున్నారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.