సిందోల్‌లో కాంగ్రెస్ మద్దతుదారు విజయం.!
MDK: రేగోడ్ మండలంలో సిందోల్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలుగుల రవికుమార్ విషయం సాధించారు. సమీప ప్రత్యర్ధి జంగమ నాగయ్య స్వామి మీద 157 ఓట్ల తేడాతో గెలుపొందారు. సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.