యంత్రాల పని గంటలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి

KMM: యంత్రాల పని గంటలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్‌లు ఎస్వీకే శ్రీనివాస్, వెంకటేశ్వరరెడ్డిలు సూచించారు. మణుగూరు ఏరియాలో పర్యటించిన డైరెక్టర్లు ఓసీ 4, మణుగూరు ఓసీ గనులను సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ.. 126.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, కార్మికులు సమష్టి కృషితో పని చేయాలన్నారు.