సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో
NLR: కలువాయిలోని సచివాలయాన్ని మంగళవారం ఎంపీడీవో శైలజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, ప్రతి ఒక్కరూ టైమ్‌కి ఖచ్చితంగా వచ్చి హాజరు వేయాలన్నారు. అలా కాకుండా సరైన సమయంలో సచివాలయానికి హాజరు కాకపోతే, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.