పత్రాలు లేవని ప్రవేశాలు నిరాకరించవద్దు: డీఈవో
VKB: విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాలు నిరాకరించవద్దని వికారాబాద్ డీఈవో రేణుకాదేవి పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, పీఈఎన్ నంబర్ వంటి పత్రాలు లేవనే కారణంగా అడ్మిషన్లను నిలిపివేయడం సరికాదన్నారు. ఇతర పాఠశాలలో ప్రవేశం పొందడానికి విద్యార్థులు కోరిన వెంటనే TC ఇవ్వాలని ఆదేశించారు.