చెరువుగట్టుపై మొక్కలు నాటిన సర్పంచ్

VZM: తెర్లాం మండలం కునాయ వలస గ్రామంలో పర్యావరణ దినోత్సవ సందర్భంగా గురువారం సర్పంచ్ బోడెల విజయ్ బాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న అన్ని చెరువు గట్లపైన మొక్కలు నాటినట్లు ఆయన తెలిపారు. పర్యావరణంను, కాపాడటానికి, వాతావరణాన్ని సమతుల్యతగా ఉంచడానికి చెట్లు ప్రధాన భూమికను పోషిస్తాయన్నారు.