జనగణణపై శిక్షణా తరగతులు నిర్వహించిన ఎమ్మార్వో
PPM: గుమ్మలక్ష్మిపురం ప్రభుత్వ పాఠశాలలో స్దానిక ఎమ్మార్వో, సెన్సస్ ఛార్ట్ ఆఫీసర్ నిమ్మక శేఖరం ఆధ్వర్యంలో గురువారం ఎన్యుమరేటర్స్‌కు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని సుమారు 57,000 జనాభా గణన కోసం 99 ఎన్యుమరేటర్స్, 17 మంది సూపర్‌వైజర్స్‌ను నియమించామన్నారు. వీరికి ఈనెల 23 వరకు జనగణనపై శిక్షణ ఉంటుందన్నారు.