VIDEO: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
TPT: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, ప్లేయర్ జితేష్ శర్మ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ. రమణ దంపతులు శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.