VIDEO: జనసంద్రమైన రాములోరి శోభాయాత్ర..!
NGKL: ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. స్వామివారి కళ్యాణం అనంతరం నిర్వహించిన శోభాయాత్రకు భక్తులు భారీగా తరలిరావడంతో వీధులన్నీ జనసంద్రంగా మారాయి. 'జై శ్రీరామ్' నినాదాలతో గ్రామం మారుమోగగా.. ఇసుక వేస్తే రాలనంత జనంతో శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది.