ఉద్యోగి ఇంక్రిమెంట్ నిలుపుదలకు కలెక్టర్ ఆదేశాం

WGL: ప్రభుత్వ, ఉద్యోగులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సత్యశారద హెచ్చరించారు. గురువారం సంగెం మండల కేంద్రంలోని ఎంపీడీవో,తహసీల్దార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ అసిస్టెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసి ఇంక్రిమెంట్ నిలుపుదలకు ఆదేశించారు.