'శాంతి భద్రతల పరిరక్షణలో జాగిలాల పాత్ర కీలకం'

GNTR: శాంతిభద్రతల పరిరక్షణలో జాగిలాలు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని హోం మంత్రి అనిత అన్నారు. మంగళగిరిలో మంగళవారం ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో మాట్లాడుతూ.. నేర పరిశోధనలో, ముఖ్యంగా మాదకద్రవ్యాల కేసులలో ఈ జాగిలాలు చేసే పనిని మరెవరూ చేయలేరని ప్రశంసించారు. మాదకద్రవ్యాల నిర్మూలనే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.