డిసెంబర్ 5న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్
ASR: 2025-2026విద్యా సంవత్సరానికి గాను డిసెంబర్ 5న మెగా పేరెంట్, టీచర్ మీట్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ శనివారం తెలిపారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సెకండరీ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పండగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో జరిగిన సమ్మేటివ్ పరీక్షల ఫలితాలు తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుందన్నారు.