తొలి రాత్రే భయంతో పరారైన వరుడు!
వివాహం జరిగిన తొలి రోజే వరుడు భయంతో పారిపోయిన ఘటన యూపీలో జరిగింది. మెనూ అనే యువకుడు విద్యుత్ బల్బు తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 3రోజులు తర్వాత అతడిని పట్టుకున్నారు. అయితే పెళ్లి రోజు అతడు తినడానికి స్నేహితులు ఏదో ఇచ్చారని.. దాన్ని తిన్న తర్వాతే తన మానసిక స్థితి మారి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు.