'బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలి'

MBNR: జిల్లా కేంద్రంలోని స్వర్ణకార భవన్లో బీసీ సంఘాల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. బీసీ జేఏసీ నాయకులు బ్రహ్మయ్య మాట్లాడుతూ.. బీసీలు పరస్పర సహకారంతో మన ఓటు మనకే మన నినాదంతో ఓట్లు చీల్చకుండా బీసీలకే వేసుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలన్నారు. బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలని కోరారు.