'మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం'

SRPT: పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ మిషను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.