'మార్కులు మాత్రమే భవిష్యత్తును నిర్ణయించవు'
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ చుట్టుగుంటలో ఉన్న ఎస్.కే.బి.యం స్కూల్‌లో 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు. మార్కులు మాత్రమే భవిష్యత్తును నిర్ణయించవని తెలిపారు.