ALERT: మరి కొద్ది గంటల్లో భారీ వర్షం
AP: కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని తెలిపింది. ఒడిశా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు పేర్కొంది. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, అనంతపురం, కాకినాడ, కోనసీమ, అల్లూరి, తూ.గో, ఏలూరు జిల్లాతో పాటు మిగిలిన కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.