వాల్మీకిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

వాల్మీకిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య: హైవేపై ముందు వెళుతున్న డీజిల్ ట్యాంకర్‌ను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం వాల్మీకిపురం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వాల్మీకిపురానికి చెందిన ఓ కారు డ్రైవర్ కలికిరి వైపు బయలుదేరాడు. మార్గంమధ్యలో కలికిరి సమీపంలో ఉన్న టోల్ ప్లాజా వద్దకు రాగానే ముందు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను అదుపుతప్పి ఢీకొట్టాడు.