సామెత - దాని అర్థం
సామెత: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి
దాని అర్థం: పెళ్లి విందు జరిగినప్పుడు, పారవేసిన విస్తరాకుల పైకి కుక్కలు ఎగబడతాయి. అవి పొట్లాడుకుని గందరగోళం సృష్టిస్తాయి. ఒక్కోసారి పెళ్లి వాయిద్యంకంటే వీటి అరుపులే ఎక్కువ అవుతాయి. సంబంధం లేని వారు చేసే హడావుడి గురించి చెప్పవలసినప్పుడు ఈ సామెత వాడతారు.