'బయటకు రావాలంటే భయమైతుంది'
KMR: జిల్లాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట కుక్కకాటు ఘటనలు వెలుగు చూస్తున్నా అధికారులు స్పందించడం లేదని, కుక్కల బెడదతో బయటకు రావాలంటేనే భయమైతోందని అంటున్నారు. ముఖ్యంగా పిల్లలపై దాడులు చేస్తున్నాయని చెబుతున్నారు. తాజాగా మాచారెడ్డి (M) చుక్కాపూర్‌లో వీధి కుక్కల దాడిలో రెండేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి.