డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రవేశాలు

డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రవేశాలు

SRPT: హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత సాంకేతిక సంస్థలో 2026-27 విద్యాసంవత్సరానికి డిప్లొమా ప్రవేశాలు ప్రారంభమైనట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని, అర్హులైన విద్యార్థులకు నెలకు రూ.2,500 స్టైపెండ్ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవాలని కలెక్టర్ సూచించారు.