నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMM: తిరుమలాయపాలెం మండలంలోని పాతర్లపాడు సబ్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది.11 కేవీ జల్లెపల్లి లైన్‌లో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనుల దృష్ట్యా, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మరమ్మతులకు వినియోగదారులు, గ్రామస్థులు సహకరించాలని అధికారులు కోరారు.