90 రోజుల్లో 18 వేల ఇంకుడు గుంతల నిర్మాణమే TARGET

90 రోజుల్లో 18 వేల ఇంకుడు గుంతల నిర్మాణమే TARGET

HYD: జలమండలి ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టనుంది. రానున్న 90 రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డు వరకు మొత్తం 18 వేల ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలమట్టాన్ని పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో నీటి సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం అందించనుంది.