అధికారులు అందుబాటులో ఉండాలి: MRO
అన్నమయ్య: చిట్వేలు మండల స్థాయి అధికారులు వారి సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని చిట్వేలు MRO స్పందన రెడ్డి ఆదేశించారు. దిత్వా తుఫాన్ రానున్న కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. చెరువులు, కాలువలలో ఈత కొట్టడానికి పిల్లలను వెళ్లనివ్వవద్దని ప్రజలకు సూచించారు.